: ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతోంది... ఏపీకి మోదీ పూర్తి న్యాయం చేస్తారు: వెంకయ్యనాయుడు
ఏపీకి ప్రత్యేక హోదాపై పలువురు పలు విధాలుగా మాట్లాడుతున్నారని... అసలు జరుగుతున్నదేంటో వారికి తెలియదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రస్తుతం అత్యున్నత స్ధాయిలో చర్చ జరుగుతోందని... రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ఏపీకి పూర్తిగా న్యాయం చేయాలన్న భావనలో ప్రధాని మోదీ ఉన్నారని... రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి బాటలో పయనింపజేస్తారని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు మళ్లీ హోదాపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబుకు లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పజెప్పారని... అయినా, చంద్రబాబు రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో నిట్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.