: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు... మేడ్చల్ లో వైన్స్ షట్టర్ లో ఇరుక్కున్న దొంగ


స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన ఓ దొంగ, ఆ తర్వాత ఏకంగా మద్యం షాపులోనే చోరీకి యత్నించాడు. అయితే అనుకోని పరిణామాల్లో అతడు వైన్ షాపు షట్టర్ లోనే ఇరుక్కుపోయాడు. షట్టర్ సందులో నుంచి బయటపడలేక అతడు పెట్టిన కేకలు విని స్థానికులు అక్కడికి వచ్చి అతడికి విముక్తి కల్పించి నేరుగా పోలీసులకు పట్టించారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని రంగశాయి వైన్స్ లో ఈ ఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది. వైన్స్ లో చోరీ కోసమే అతడు వచ్చాడంటూ స్థానికులు, వైన్స్ యాజమాన్యం చెబుతుండగా, మద్యం కోసమే వచ్చానని ఆ దొంగ చెబుతున్నాడు. ఈ విషయాల్లో ఏది నిజమో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News