: మన్మోహన్ సింగ్ ఐదేళ్లంటే...వెంకయ్య పదేళ్లన్నారు: కిల్లి కృపారాణి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యేకహోదా అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు పదేళ్ల ప్రత్యేకహోదా కోరారని గుర్తుచేశారు. అనంతరం తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుర్తుచేశారు. విజయవాడలో ప్రత్యేకహోదాపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, అప్పుడు పదేళ్లన్న వెంకయ్యనాయుడు అధికారం చేపట్టగానే బిల్లులో లేదన్న విషయం గుర్తుకు వచ్చిందని అన్నారు. ప్రత్యేకహోదాకు చట్టబద్ధతలేదు, ఆంధ్రప్రదేశ్ కు అర్హత లేదు అని కేంద్రం వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News