: తెలంగాణకూ ప్రత్యేకహోదా ప్రకటించాలి: శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
తెలంగాణకు ప్రత్యేకహోదా ప్రకటించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. 60 ఏళ్ల పాటు దోపిడీకి గురైన తెలంగాణను ఆదుకునేందుకు ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సాధనకోసం అవసరమైతే ఉద్యమం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగి ఇంత కాలం అవుతున్నా ఆంధ్రా ఉద్యోగులు తమ ప్రాంతానికి పోకుండా తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.