: నిజామాబాద్ లో ఆకతాయి ఆటో డ్రైవర్ కు దేహశుద్ధి
నిజామాబాద్ లో ఆటోవాలాల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు ఆటో ఎక్కితే చాలు ఆకతాయి ఆటోడ్రైవర్లు రెచ్చిపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ లోని నాందేవ్ వాడ నుంచి ప్రభుత్వాసుపత్రికి వస్తున్న మహిళలతో ఆటో డ్రైవర్, అతనితో పాటు వున్న ఇంకో వ్యక్తి అసభ్య పదజాలంతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆటో దిగిన మహిళలు వారికి దేహశుద్ధి చేశారు. ఆ దగ్గర్లో ఉన్నవారు విషయం తెలుసుకుని వారు కూడా వచ్చి తలో చేయివేశారు. దీంతో ఆటో డ్రైవర్ పారిపోగా, మరో వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ల పోకిరీ వేషాలతో వేగలేకపోతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.