: నేరాలు, అత్యాచారాల్లో ఆ రాష్ట్రమే నెంబర్ వన్
దేశంలో అత్యధిక నేరాలు, అత్యాచారాలు మధ్యప్రదేశ్ లో జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో) తెలిపింది. దీంతో దేశంలో నేరాల గణాంక జాబితాలో మధ్యప్రదేశ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని ఎన్సీఆర్బీ వెల్లడించింది. జాతీయ నేర గణాంక వివరాలు వెల్లడించిన ఎన్సీఆర్బీ మధ్యప్రదేశ్ తరువాతి స్థానంలో రాజస్థాన్ నిలిచిందని తెలిపింది. కాగా, 2014లో 2,72,423 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ చెప్పింది. రాజస్ధాన్ లో 3,759 లైంగిక వేధింపుల కేసులు నమోదు కాగా, ఉత్తర ప్రదేశ్ లో 3,467 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ పేర్కొంది.