: 'ఉపహార్' కేసులో రూ. 60 కోట్ల పరిహారం చెల్లించాలంటూ తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు


18 ఏళ్ల క్రితం 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బోర్డర్ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, థియేటర్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఊపిరాడక కొందరు, తొక్కిసలాటలో మరికొందరు... ఇలా మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విచారణ సంస్థ 2007లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు సినిమా హాల్ యజమానులైన సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. 18 ఏళ్ల తర్వాత నేడు ఈ కేసుకు సుప్రీంకోర్టు ముగింపు పలికింది. బాధిత కుటుంబాలకు రూ. 60 కోట్లు చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, అన్సల్ సోదరులకు హైకోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను కూడా రద్దు చేసింది.

  • Loading...

More Telugu News