: 'సంగా వీడ్కోలు' అంశం వాళ్లపైనే ఒత్తిడి పెంచుతుంది... మాకేం కాదు: కోహ్లీ
తొలి టెస్టులో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ లో 0-1తో వెనుకబడిన టీమిండియా కుర్రాళ్లు ఇప్పుడు రెండో టెస్టుకు సమాయత్తమవుతున్నారు. ఆగస్టు 20 నుంచి 24 వరకు జరిగే ఈ టెస్టు మ్యాచ్ కు కొలంబోలోని సారా ఓవల్ వేదికగా నిలుస్తోంది. మ్యాచ్ సన్నద్ధతపై భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. "సంగక్కర రిటైర్మెంటు అంశం కారణంగా లంక జట్టుపై మరింత ఒత్తిడి పడుతుంది. ఆ అంశం మమ్మల్నేమీ కలవరపరిచేది కాదు. ఇక, జట్టు అంచనాలపై ఆటగాళ్లు రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. వారితో అదే చెప్పాను. ఓ భాగస్వామ్యంలో పరుగులు తీయడం ఎంత ముఖ్యమో, భావవ్యక్తీకరణ కూడా ముఖ్యమే. తొలి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. అయితే, ఏ విభాగం కూడా చింతించాల్సిన స్థాయిలో లేదు. కుర్రాళ్లలో మంచి స్ఫూర్తి నెలకొని ఉంది" అని తెలిపాడు.