: అక్షయ్ కుమార్ కి సరైన జోడీ ఎవరంటే ...!: ట్వింకిల్ ఖన్నా


ఒకప్పటి బాలీవుడ్ నటి, రచయిత్రిగా మారిన ట్వింకిల్ ఖన్నా చాలా ఓపెన్. తానేమనుకుంటుందో కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. తాజాగా తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీ బోన్స్: షి ఈజ్ జస్ట్ లైక్ యూ, ఏ లాట్ లైక్ మి హియర్' ఆవిష్కరణ తరువాత తన స్నేహితుడు, దర్శకనిర్మాత కరణ్ జోహార్ అడిగిన కొన్ని ప్రశ్నలకు చాలా సరదాగా సమాధానాలు చెప్పింది. అందులో కొన్ని చూస్తే... కరణ్ జోహార్: మీరు ఎవరితో రియాలిటీ షో చేయాలనుకుంటున్నారు? ట్వింకిల్: వివాదాస్పద సన్యాసిని రాధేమాతో! కరణ్ జోహార్: రణబీర్ కపూర్ గురించి మీరేం చెబుతారు? ట్వింకిల్: కత్రినా కైఫ్ నా నాలుకపై ఉంది కాబట్టి రణబీర్ గురించి ఏం మాట్లాడలేను కరణ్ జోహార్: దీపికా పదుకునే గురించి చెప్పండి? ట్వింకిల్: ఆమె ఏమైనా చేయగలదు! కరణ్ జోహార్: అక్షయ్ తరువాత సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తే బాగుంటుందనుకుంటున్నారు? ట్వింకిల్: జయలలిత! ఎందుకంటే ఆమె గొప్ప పోరాటయోధురాలు కరణ్ జోహార్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలిస్తే ఏం అడుగుతారు? ట్వింకిల్: మా ఆయనకు క్రీడా శాఖ మంత్రి ఇవ్వమని అడుగుతా! కరణ్ జోహార్: అక్షయ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పండి? ట్వింకిల్: సినిమాల్లో ట్రాజెడీ సీన్లు చూసినప్పుడు ఏడుస్తుంటాడు! ప్రతి రాత్రి గళ్ల పైజామా ధరిస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో డ్రింక్ చేస్తాడు. కరణ్ జోహార్: పోర్న్ వెబ్ సైట్ల నిషేధంపై మీ అభిప్రాయం? ట్వింకిల్: ఓ తల్లిగా సంతోషిస్తున్నా. పౌరురాలిగా విబేధిస్తున్నా కరణ్ జోహార్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్ పై మీ కామెంట్? ట్వింకిల్: ఓ చెట్టును పెళ్లి చేసుకుంటే ఏమనరు. కానీ స్వలింగ సంపర్కుల వివాహానికి అస్సలు ఒప్పుకోరు!

  • Loading...

More Telugu News