: ధోనీ విమానం నుంచి దూకాడు!
టీమిండియా వన్డే జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీలో తన హోదాకు న్యాయం చేసే ప్రక్రియలో ఓ విజయం సాధించాడు. ఎఎన్-32 విమానంలో ప్రయాణిస్తూ 1250 అడుగుల ఎత్తు నుంచి పారాషూట్ జంప్ చేశాడు. ఆర్మీ నిబంధనలను అనుసరించి మరో నాలుగు పర్యాయాలు ధోనీ ఈ ఫీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు పర్యాయాలు 10000 వేల అడుగుల ఎత్తు నుంచి దూకాల్సి ఉంటుంది. వాటిలో ఓ పర్యాయం రాత్రి వేళ దూకాలి. ఈ ప్రక్రియలో ధోనీ విజయవంతం అయితే, అతడికి ప్రత్యేక బ్యాడ్జ్ ప్రదానం చేస్తారు. తద్వారా క్వాలిఫైడ్ పారాజంపర్ గా అవతరిస్తాడు. ఆ బ్యాడ్జ్ పొందేందుకు గాను ధోనీ కొన్ని వారాలుగా ఆగ్రాలోని ఆర్మీ సెంటర్ లో కఠోర శిక్షణ పొందుతున్నాడు.