: రాజ్ ఠాక్రే భార్యను ముఖంపై దారుణంగా కరిచిన పెంపుడు కుక్క
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సతీమణి శర్మిలను వారు పెంచుకుంటున్న కుక్క బలంగా కరిచింది. దాంతో ఆమె ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ముంబయిలోని హిందుజా ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసి చెంపపై 65 కుట్లు వేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రేట్ డాన్ జాతికి చెందిన పెంపుడు కుక్క దంతాలు శర్మిల ముఖంలో బాగా లోతుకు దిగాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో రాజ్ ఠాక్రే తన నివాసంలో మీడియా సమావేశంలో ఉన్నారని, అది ముగిసిన వెంటనే హిందూజా ఆసుపత్రికి వెళ్లారని తెలిసింది. ఠాక్రే ఇంట్లో జేమ్స్, బాండ్ అనే రెండు పెంపుడు కుక్కలున్నాయి. ఈ బాండ్ అనే కుక్క శర్మిలపై దాడిచేసి దారుణంగా కరిచిందని తెలుస్తోంది.