: ములాయం వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా సంఘాలు
"ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడం జరిగే పనేనా? ఓ వ్యక్తి రేప్ చేస్తే, అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసి 'సామూహిక అత్యాచారం' అంటున్నారు"... ఈ వ్యాఖ్యలు చేసింది సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్. ఇప్పుడాయన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ లోని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పురుషాధిక్య సమాజానికి ములాయం నిలువెత్తు నిదర్శనమని, ఆయనకు మహిళలను గౌరవించడం తెలియదని మహిళా సంఘాల నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేని ములాయం ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యూపీలో సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి తెలియడంలేదని అన్నారు.