: షారుక్ కొడుకు... అప్పుడే సిక్స్ ప్యాక్ బాడీ!


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ ను చూస్తుంటే తండ్రిని మించే తనయుడు అయ్యేలా ఉన్నాడు. ఎందుకంటారా? పలు సినిమాల్లో షారుక్ తన సిక్స్ ప్యాక్ దేహాన్ని చూపుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. కానీ 17 ఏళ్ల ఆర్యన్ మాత్రం సినిమాల్లోకి రాకుండానే సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం లండన్ లో చదువుతున్న ఆర్యన్ సిక్స్ ప్యాక్ బాడీతో అక్కడి బీచ్ లో తిరుగుతున్న ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలో అచ్చం తండ్రిలాగే కనిపిస్తున్న ఆర్యన్... తండ్రికే పోటీ ఇచ్చేలా ఉన్నాడని అంతా అంటున్నారు.

  • Loading...

More Telugu News