: ఐరాస 'విమెన్ మిషన్' అంబాసిడర్ గా అనుపమ్ ఖేర్
ఐక్యరాజ్య సమితికి చెందిన 'విమెన్ మిషన్' అంబాసిడర్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నియమితులయ్యారు. ఈ మేరకు 'హి ఫర్ షి' (ఆమె కోసం అతను) అనే కార్యక్రమానికి తాను ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు అనుపమ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనపై ఇంతటి గౌరవాన్ని ఉంచినందుకు యూఎన్ విమెన్ విభాగానికి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. స్త్రీ, పురుషుల సమానత్వానికి తాను కట్టుబడి ఉన్నానని, తనపై పెట్టిన ఈ బాధ్యతను పరిపూర్ణం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అనుపమ్ పేర్కొన్నారు. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని అధిగమించేందుకు పురుషులను, మగపిల్లలను భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా 'హి ఫర్ షి' కార్యక్రమం రూపొందించారు.