: ఆమెను చూస్తే చంద్రబాబుకు ఎంతో భయం: పెద్దిరెడ్డి


తమ ఎమ్మెల్యే రోజాను చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో భయపడతారని... ఆమెను చూస్తే అంత భయం ఎందుకో అని వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై నిజాయతీగా పోరాడుతున్న వైకాపా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆటవిక పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేసే అన్యాయాలు, అక్రమాలను ఎత్తి చూపితే లాఠీలు ఝుళిపిస్తారా? కేసులు పెడతారా? అని నిలదీశారు. ప్రభుత్వ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు.

  • Loading...

More Telugu News