: గుడ్డ బ్యాగుతో పర్యావరణ ప్రచారం
ఆ అమ్మడి లక్ష్యం.. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడమే. అందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో లక్షల మంది ఎన్నో వేలవేల విధాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆమె మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. దాని ద్వారా అవగాహన కల్పించడంతో పాటూ.. గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కదలచుకుంది.
థానేలోని మనీషా ఓగలే (31) అనే యువ చిత్రకారిణి ముందుగా 21 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పుతో భారీ కాన్వాసు బ్యాగును రూపొందించింది. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన అనేక చిత్రాలను దీనిపై చిత్రించింది. ఈ చిత్రాలతో ఆవిష్కరించిన బ్యాగు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కే అర్హతను కూడా సాధించింది. అదీ సంగతి.