: మోదీతో చంద్రబాబు భేటీ వాయిదా


ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ వాయిదా పడింది. ప్రధానితో చంద్రబాబు భేటీని పీఎంఓ కూడా నిన్ననే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ భేటీ వాయిదా పడింది. ఈ నెల 25, 28, 29, 31 తేదీల్లో ఏదో ఒక రోజు ఈ భేటీ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైన తర్వాత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరతారు. రేపటి భేటీ వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News