: నాగం స్థాపించిన 'తెలంగాణ బచావత్ మిషన్'కు బీజేపీ అనుమతి లేదు: కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నప్పటికీ... వాటిని పూర్తి చేయకుండా, మిషన్ కాకతీయ పథకం పేరుతో హడావుడి చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలోనే ఉన్నారని... కానీ, ఆయన స్థాపించిన తెలంగాణ బచావత్ మిషన్ కు మాత్రం బీజేపీ అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే, మంచి పనులు ఎవరు చేసినా అభినందించక తప్పదని చెప్పారు.