: మహిళల కిడ్నాపుల్లో అత్యధికం ఎందుకు జరుగుతాయంటే..: కారణం వివరించిన ఎన్సీఆర్బీ


ఇటీవలి కాలంలో మహిళల కిడ్నాప్ లు ఎక్కువయ్యాయి. వీటికి కారణాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. గత సంవత్సరం మొత్తం 77,000 కిడ్నాప్ కేసులు నమోదు కాగా, అందులో 31,000... అంటే దాదాపు 40 శాతం కిడ్నాపులు వారిని వివాహం చేసుకునే ఉద్దేశంతోనే జరిగాయని ఎన్సీఆర్బీ తాజా నివేదిక వివరించింది. 1,500 కిడ్నాపులు వారిని హతమార్చేందుకు జరిగాయని, 676 కిడ్నాపులు డబ్బులు వసూలు చేసేందుకు జరిగాయని తెలిపింది. బీహార్, అసోం రాష్ట్రాల్లో నమోదైన కిడ్నాపుల్లో 50 శాతానికి పైగా వివాహానికి వారిని ఒప్పించేందుకు జరిగినవేనని, యూపీలో అత్యధికంగా 7,338 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. బీహారులో 4,641 కేసులు నమోదు కాగా, 70 శాతం పెళ్లికి సంబంధించినవేనని వెల్లడించింది. ఓ యువకుడు, యువతి ప్రేమించుకొని, పెళ్లి చేసుకునే నిమిత్తం పారిపోతే, అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసులు పెట్టడమే ఇందుకు కారణమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News