: రచయిత్రిగా అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా... తొలి పుస్తకం 'మిసెస్ ఫన్నీ బోన్స్' విడుదల


బాలీవుడ్ దివంగత రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియాల పెద్ద కుమార్తె, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా రచయిత్రిగా మారింది. 'మిసెస్ ఫన్నీ బోన్స్: షి ఈజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఎ లాట్ లైక్ మి హియర్' పేరుతో ఆమె రాసిన తొలి పుస్తకం విడుదలైంది. ముంబయిలో నిర్వహించిన కార్యక్రమానికి అక్షయ్, డింపుల్, అమీర్ ఖాన్, కరణ్ జోహర్, జయాబచ్చన్, సుసానే రోషన్, సొనాలి బింద్రే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి తనకు రచనలు చేయడం అంటే ఇష్టమని తెలిపింది. గత రెండు సంవత్సరాల నుంచి కాలమ్స్ రాస్తున్నానని చెప్పింది. ఇదే సమయంలో అక్షయ్ మీ రచనల్లో జోక్యం చేసుకుంటారా? అని విలేకరులు అడగ్గా, ఆయనే తన ఎడిటర్ అంటూ ట్వింకిల్ సమాధానం ఇచ్చింది. సమాజంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో 'మిసెస్ ఫన్నీ బోన్స్' పేరుతోనే ట్వింకిల్ కొంతకాలం నుంచి కాలమ్స్ రాసింది.

  • Loading...

More Telugu News