: రోజా అరెస్ట్... పెద్దిరెడ్డి, నారాయణ స్వామి కూడా... నగరిలో ఉద్రిక్తత!
తమ పార్టీ స్థానిక నేతల అరెస్టులను నిరసిస్తూ వైసీపీ జరుపుతున్న ఆందోళన నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మహిళా నేత, సినీ నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో పోలీసులు ముందుగానే 144 సెక్షన్ విధించారు. అయినా ఆ పార్టీ నేతలు నిరసనకు దిగే యత్నం చేశారు. ఈ క్రమంలో రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో ఎమ్మెల్యే నారాయణస్వామిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రోజాకు మద్దతు పలికేందుకు బయలుదేరిన పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డిని కూడా పోలీసులు చిత్తూరులోనే అదుపులోకి తీసుకున్నారు.