: ప్రథమ మహిళ సువ్రా ముఖర్జీ గురించి మనకు తెలియని అంశాలు!


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి, దేశ ప్రథమ మహిళ సువ్రా ముఖర్జీ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు * సువ్రా ముఖర్జీ, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్న జెస్సోర్ లో సెప్టెంబర్ 17, 1940లో జన్మించారు. * 1957, జూలై 13న ప్రణబ్ ముఖర్జీతో ఆమెకు వివాహం జరుగగా, వారికి అభిజిత్, ఇంద్రజిత్ అనే కుమారులు, శర్మిష్ఠ అనే కుమార్తె ఉన్నారు. * సువ్రాకు 10 సంవత్సరాల వయసులోనే ఆమె కుటుంబం కోల్ కతాకు వలస వచ్చింది. * రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' గీతానికి ఆమె వీరాభిమాని. * రవీంద్రుని సంగీతాన్ని అత్యంత అభిమానించే ఆమె, ఆయన గీతాలకు నృత్యరూపకాలు తయారు చేసి ఇండియా, యూరప్ ఆసియా, ఆఫ్రికాల్లో ఎన్నో చోట్ల ప్రదర్శించారు. * 'గీతాంజలి ట్రూప్'ను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. * ఆమె నైపుణ్యవంతురాలైన చిత్రకారిణి కూడా. తాను గీసిన చిత్రాలతో ఎన్నో సోలో ఎగ్జిబిషన్లను నిర్వహించారు. * సువ్రా రెండు పుస్తకాలు రాశారు. ఇందిరా గాంధీతో తనకున్న బంధంపై 'చోఖెర్ అలోయె', తన చైనా పర్యటన గురించిన వివరాలతో 'చేనా అచెనాయ్ చిన్' రచనలు చేశారు. * ఆమె రాష్ట్రపతి భవన్ లోకి ప్రవేశిస్తున్న వేళ తన హార్మోనియం, తంబురాలను వెంట తెచ్చుకున్నారు. వీటిని ఆమెకు ప్రముఖ బెంగాలీ మ్యూజిక్ మ్యాస్ట్రో డీఎల్ రాయ్ బహుకరించారు. * రవీంద్రుని సంగీతాన్ని ప్రచారం చేస్తున్న బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను అంటే సువ్రాకు ఎంతో అభిమానం.

  • Loading...

More Telugu News