: ఈ నెల 25న బందర్ లో జగన్ ధర్నా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న బందర్ లో ధర్నా నిర్వహించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుందని చెప్పారు. కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందించని నేపథ్యంలో వారి తరపున ఒత్తిడి తెచ్చేందుకే జగన్ ఈ ధర్నా చేయబోతున్నట్టు నాని వివరించారు. అలాగే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అంతకుముందే జగన్ డిమాండ్ చేసిన విషయాన్ని నాని గుర్తు చేశారు.