: సచివాలయంలో బాలకృష్ణ


హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ సచివాలయానికి విచ్చేశారు. తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరింపజేసుకునే ఉద్దేశంతో సెక్రటేరియట్ కు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పలువురు మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల టీడీపీ నిర్వహించిన సర్వేలో... అనంతపురం జిల్లాలో బెస్ట్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ నిలిచిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ రాకతో సచివాలయంలో సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News