: అందాల 'బొమ్మ'తో అమ్మకాలు పెంచుకుంటున్న మెక్ డోనల్డ్స్


ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తిలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న మెక్ డోనల్డ్స్ సంస్థ, తైవాన్ లో వినూత్నశైలిలో వ్యాపారం వృద్ధి చేసుకుంటోంది. ఇక్కడి స్థానిక మెక్ డోనల్డ్స్ స్టోర్ లో అచ్చం బొమ్మలాంటి అమ్మాయితో అమ్మకాలు సాగిస్తోంది. దీంతో షాపుకు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. బార్బీ బొమ్మలా ఉన్న ఆమె ఫోటోలు తీసుకునేందుకు, ఆమెను చూసేందుకు మెక్ డోనల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు క్యూ కట్టడంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది. అక్కడ ఫుడ్ సప్లై చేసే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే వైరల్ గా షేర్ అవుతున్నాయని అక్కడి వారు పేర్కొంటున్నారు. అందమైన అమ్మాయి అమ్ముతుంటే కొనడానికి అభ్యంతరం ఏముంటుందని స్థానిక యువకులు ఉత్సాహంగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News