: బూతులు నేర్చిన చిలుక... పోలీసులను ఇరకాటంలో పడేసింది!


మహారాష్ట్రలో ఓ చిలుక వ్యవహారం ఆసక్తిగొలుపుతోంది. చంద్రపూర్ జిల్లాలోని రజూరా పోలీసులు ఓ రామచిలుకను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఇంతకీ ఆ చిలుక చేసిన నేరమేంటో చూద్దాం! రజూరా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే జనాభాయ్ సఖార్కర్ (85) అనే వృద్ధురాలికి, సవతి కుమారుడు సురేశ్ తో ఆస్తి వివాదం నడుస్తోంది. తాజాగా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జనాభాయ్. పెంపుడు చిలుక 'హరియాల్'కు బూతులు నేర్పి, దానితో తనను తిట్టిస్తున్నాడని తెలిపింది. అతని ఇంటి ముందు నుంచి తాను ఎప్పుడు వెళ్లినా ఆ చిలుక ధారాళంగా బూతులు గుప్పిస్తోందని, భరించలేకపోతున్నానని ఫిర్యాదులో వాపోయింది. దాంతో, సురేశ్, జనాభాయ్ లతో పాటు చిలుకను కూడా స్టేషన్ కు పిలిపించారు. అయితే, పోలీసుల ముందు ఆ చిలుక నోరు తెరవలేదట. ఏమీ తెలియనిదానిలా మౌనంగా ఉండిపోయిందట. దాంతో, ఎవరిని విచారించాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News