: బ్యాంకాక్ పేలుళ్ల అనుమానితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు


బ్యాంకాక్ బాంబు పేలుళ్లకు పాల్పడిన అనుమానితుడి ఫోటోను థాయ్ పోలీసులు విడుదల చేశారు. బాంబు పేలుళ్ల అనంతరం దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, అక్కడికి దగ్గర్లోని కమర్షియల్ కాంప్లెక్స్ లోని సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడికి ముందు ఓ బ్యాగుతో ఆ ప్రాంతానికి చేరుకున్న ఓ వ్యక్తి, సంఘటనా స్థలి నుంచి బ్యాగు లేకుండా వెళ్తుండడాన్ని గమనించారు. దీంతో అతడి ఫోటోను విడుదల చేశారు. అతడే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, పేలుడు ఘటనను చైనా పర్యాటకుడు పూర్తిగా చిత్రీకరించాడు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు థాయ్ లాండ్ వాసులు, ఇద్దరు మలేసియన్లు, ఇద్దరు చైనీయులు, ఇద్దరు హాంగ్ కాంగ్ వాసులు, ఒక సింగపూర్ వ్యక్తి, జాతీయత నిర్ధారణ కాని మరొకరు, వీరంతా మృతి చెందారని థాయ్ లాండ్ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News