: వచ్చే వారం ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్న సుష్మా స్వరాజ్
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ వచ్చేవారం ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తారు. పర్యటన సందర్భంగా ఆమె ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో సమావేశమవుతారు. అనంతరం, ఈజిప్టు విదేశాంగ మంత్రి సమే హసన్ షౌక్రీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అటుపై లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సెక్రటరీ జనరల్ నబిల్ ఎల్ అరబీతో భేటీ అవుతారు. విదేశాంగ మంత్రి హోదాలో తొలిసారిగా ఈజిప్టులో పర్యటించనున్న సుష్మ రాజధాని నగరం కైరోలోని ప్రతిష్ఠాత్మక డిప్లొమాటిక్ క్లబ్ లో ప్రసంగిస్తారు.