: ఔను! నేను పాకిస్తాన్ జాతీయుడినే!: లై డిటెక్టర్ టెస్టులో నవేద్ అంగీకారం


జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ వద్ద నాటకీయ ఫక్కీలో పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ కు లై డిటెక్టర్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా నవేద్ తాను పాకిస్థాన్ జాతీయుడినే అని అంగీకరించాడు. భారత భద్రతా దళాలపై దాడి చేయాలని తనను ఆదేశించారని తెలిపాడు. తనకు శిక్షణ ఇచ్చింది లష్కరే తోయిబా అని వెల్లడించాడు. నవేద్ చెప్పిన విషయాలు ఇప్పుడు పాకిస్థాన్ ను చిక్కుల్లో పడేసేవే. నవేద్ ను భారత బలగాలు అదుపులోకి తీసుకోగానే, అతడు తమ దేశానికి చెందిన వాడు కాదని పాక్ సర్కారు పేర్కొంది. అతడి జాతీయత గురించి తమకు తెలియదని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News