: చండిమాల్ ను కట్టడి చేస్తాం: అమిత్ మిశ్రా
భారత్ తో జరిగిన తొలి టెస్టులో అనితరసాధ్యమైన ఆటతీరుతో కష్టాల నుంచి గట్టెక్కించిన శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమాల్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని టీమిండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు. తొలిటెస్టులో చండిమాల్ ను కట్టడి చేయకపోవడం వల్లే భారత్ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. కొలంబో వేదికగా గురువారం ప్రారంభం కానున్న రెండో టెస్టులో చండిమాల్ ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నాడు. అతనిని వీలైనంత తొందరగా పెవిలియన్ పంపేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. చండిమాల్ పై బౌలింగ్ దాడి చేస్తామని అమిత్ మిశ్రా వెల్లడించాడు. తొలి టెస్టులో 162 పరుగులు చేసి భారత బౌలర్లను చండిమాల్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.