: అండర్ వరల్డ్ డాన్ గుట్టు భారత్ కనిపెట్టేసిందంటున్న డైలీ మెయిల్


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుట్టు భారత్ కనిపెట్టేసిందంటూ డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. పాకిస్థాన్ ఐఎస్ఐ రక్షణలో ఉన్న దావుద్ ఇబ్రహీంకి సంబంధించిన నాలుగు ఇళ్లను భారత్ కనిపెట్టేసిందని తెలిపింది. ఇస్లామాబాద్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురీలో ఉన్న ఇంటితో పాటు కరాచీలో ఉన్న మూడు ఇళ్ల గురించిన పూర్తి వివరాలతో భారత నిఘా సంస్థలు ఓ నివేదిక తయారు చేశాయని పేర్కొంది. ఈ నెలలో జరగనున్న రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఈ నివేదికను భారత అధికారులు పాక్ కు అందజేయనున్నారు. ప్రధాని యూఏఈ పర్యటనలో కూడా దావూద్ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు డైలీ మెయిల్ వెల్లడించింది. దావూద్ ను అష్టదిగ్బంధం చేసి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని భారత్ భావిస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని డైలీ మెయిల్ పేర్కొంది. అన్ని వైపుల నుంచి పాకిస్థాన్ పై ఒత్తిడి తెచ్చి, దావూద్ ను భారత్ రప్పించేందుకు నిఘా సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని డైలీ మెయిల్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News