: ఆ ప్యాకేజీ భిక్ష కాదు...హక్కు: నితీష్ కుమార్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్లో స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీ భిక్ష కాదని, బీహారీల హక్కని ఆయన స్పష్టం చేశారు. ఎవరి దయాదాక్షిణ్యాలు తమకు అక్కర్లేదని ఆయన తెలిపారు. ఆర్భాటంగా లక్షా పాతిక వేల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిన మోదీ, దాని వివరాలేంటో వెల్లడించలేదని, వాటి కోసం ఎదురు చూద్దామని అన్నారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎవరి దగ్గరకైనా వెళ్లి కలవాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని, తనకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.