: ప్రకాష్ రాజ్ కు 'టెన్షన్' తెచ్చిపెట్టిన కేఎఫ్ జే యాడ్!
"కల్యాణ వయసులా పొన్ను ఇరుంధాలే... టెన్షన్ దానే" (పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉంటే టెన్షనే కదా) అంటూ దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ కేఎఫ్ జే జ్యూయలర్స్ కు చేసిన వ్యాపార ప్రకటన ఆయనకు కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది. లైంగిక అసమానతలను వేలెత్తి చూపేలా ఈ వ్యాపార ప్రకటన ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయి పెళ్లి కోసం బంగారు నగలను కొనాలన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ యాడ్ నేటి తరం అతివలను అవమానించేదిగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంతో మంది మహిళలు సాధికారత సాధిస్తూ, తమ కాళ్లపై తాము నిలబడి సంపాదిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ సమాజంలో, పెళ్లికాని అమ్మాయి భారమేనన్న భావన కలిగించేలా యాడ్ ఉందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రకాష్ రాజ్ పై, కేఎఫ్ జే జ్యూయలర్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.