: ఇస్లామిక్ ప్రజలపై దాడులకు అనుమతిస్తావా?... ద్రోహీ!: టర్కీ అధ్యక్షుడిపై ఐఎస్ మండిపాటు
టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు కారాలుమిరియాలు నూరుతోంది. తమపై దాడులకు దేశంలోని ఎయిర్ బేస్ లు వాడుకునేందుకు అమెరికాకు అనుమతిచ్చిన ఎర్డోగాన్ ఓ ద్రోహి అని ఐఎస్ విమర్శించింది. టర్కీలోని ముస్లింలు తమకు మద్దతివ్వాలని, నాస్తికులు, క్రూరులకు వ్యతిరేకంగా పోరాడాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో ఓ ఐఎస్ ఫైటర్ టర్కిష్ లో సందేశాన్ని వెలువరించాడు. ఇస్లామిక్ ప్రజలపై దాడులకు అమెరికాను అనుమతించాడంటూ ఎర్డోగాన్ పై ఆరోపణ చేశాడు. గతవారం ఆరు ఎఫ్-16 ఫైటర్ జెట్లు టర్కీలోని ఓ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. అక్కడి నుంచి దేశంలోని ఐఎస్ మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఉపక్రమించాయి.