: బ్యాంకాక్ లో మరోబాంబు పేలుడు


థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. సెంట్రల్ బ్యాంకాక్ లోని ప్రఖ్యాత బ్రహ్మదేవాలయ ప్రాంగణంలో నిన్న బాంబు దాడితో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రవాదులు, నేటి ఉదయం బ్యాంకాక్ లోని చావో ప్రయా నది సమీపంలో బాంబు దాడికి పాల్పడ్డారు. చావో ప్రయా నదిపైనున్న వంతెనపై నుంచి బాంబును విసిరేయడంతో బాంబు పేలుడు సంభవించింది. బాంబు విస్ఫోటనం ధాటికి నీరు ఎగసిపడింది. నీరు భారీ ఎత్తున ఎగసిపడడం సీసీటీవీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు, సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని సమాచారం. కాగా, నిన్న జరిగిన బాంబు దాడిలో 27 మంది మృతిచెందగా, 123 మంది గాయపడ్డారు. పేలడానికి సిద్ధంగా ఉన్న మరోబాంబును థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News