: సంగక్కరను బ్రాడ్ మన్, సచిన్ తో పోల్చిన టీమిండియా


శ్రీలంక దిగ్గజ కీపర్, బ్యాట్స్ మన్ సంగక్కరను డాన్ బ్రాడ్ మన్, సచిన్ టెండూల్కర్ తో టీమిండియా ఆటగాళ్లు సరిపోల్చారు. శ్రీలంక క్రికెట్ కు విశేషమైన సేవలందించిన సంగక్కర భారత్ తో జరుగనున్న రెండో టెస్టు తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, టీమిండియా జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తదితరులు సంగక్కర సేవలను కొనియాడారు. సంగక్కర ఆటతీరును గణాంకాలే చెబుతాయని పేర్కొన్నారు. జట్టును ముందుండి నడిపించడంలో సంగక్కరది ప్రముఖ పాత్ర అని ప్రశంసించారు. కాగా, కొలొంబో వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలవ్వడంతో సిరీస్ లో ఒక విజయంతో శ్రీలంక ముందంజలో ఉంది.

  • Loading...

More Telugu News