: ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లు ఈ కంపెనీవే!


శరవేగంగా విస్తరిస్తున్న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కస్టమర్లు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది ఏ కంపెనీ ఫోన్లో తెలుసా? సౌత్ కొరియా కేంద్రంగా పనిచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు సాగిస్తున్న శాంసంగ్ కంపెనీవట. ఈ విషయాన్ని సీఎంఆర్ (సైబర్ మీడియా రీసెర్చ్) మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్ - జూన్ మధ్యకాలంలో ఇండియాలో అమ్ముడైన సెల్ ఫోన్లలో శాంసంగ్ 20.6 శాతం వాటాను నమోదు చేసిందని సీఎంఆర్ వెల్లడించింది. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే శాంసంగ్ మార్కెట్ వాటా 24.6 శాతం కాగా, రెండో స్థానంలో మైక్రో మ్యాక్స్ 14.8, ఇంటెక్స్ 10.4 శాతం వాటాతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తొలి త్రైమాసికంతో పోలిస్తే 7 శాతం మేరకు విక్రయాలు పెరిగాయని సీఎంఆర్ పేర్కొంది. ఈ మూడు నెలల్లో మొత్తం 5.66 కోట్ల హ్యాండ్ సెట్ల అమ్మకాలు జరుగగా, అందులో 43 శాతం స్మార్ట్ ఫోన్లు కావడం విశేషం.

  • Loading...

More Telugu News