: ఆయన సెలబ్రిటీ కాదు, ఆయన ఉత్తరం రూ.77లక్షలు


ఆయన ఏమాత్రం సెలబ్రిటీ కాదు. ఇప్పుడు.. 77 లక్షల రూపాయల ధర పలుకుతున్నట్లుగా చెబుతున్న ఆయన ఉత్తరమూ.. ఏదో సెలబ్రిటీకి రాసినదో లేదా, అత్యంత భావోద్వేగాలను సమ్మిళితం చేసి.. తన ప్రియురాలికి ఉద్దేశించినదో కూడా కాదు. అది కేవలం తన తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం.

1912 ఏప్రిల్‌ 10వ తేదీన సౌత్‌ ఆంప్టన్‌ ఓడరేవునుంచి టైటానిక్‌ బయల్దేరింది. ఆ ఓడ వైభవాన్ని. తన సంగీత బృందంలోని సహచరులను గురించి వివరిస్తూ.. అందులో ఉండే బ్యాండ్‌ మాస్టర్‌.. తన తల్లిదండ్రులకు ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఇప్పుడు వేలం వేస్తే 93 వేల పౌండ్లకు అమ్ముడయింది.

టైటానిక్‌ సినిమా మీకు గుర్తుందా? అందులో గుండెను చెమ్మగిలజేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నప్పటికీ... బ్యాండ్‌ బృందాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. ఒకవైపు ఓడ మునిగిపోతుండగా... ఆ విషాదాన్ని పలికించడమే తమ ధర్మంలాగా భావిస్తూ... సంగీతం వినిపిస్తూనే మరణాన్ని ఆహ్వానించే ఆ బ్యాండ్‌ బృందం అందరికీ ప్రత్యేకంగా గుర్తుంటుంది. బహుశా అందువల్లనే బ్యాండ్‌ మాస్టర్‌ రాసిన ఉత్తరానికి కూడా అంత క్రేజ్‌ ఏర్పడి ఉంటుంది.

  • Loading...

More Telugu News