: ఏపీలాగే బీహార్ కూ మొండి చేయి చూపిస్తారు: రఘువీరా


బీహార్ కు ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఏపీ పీసీీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శలు చేశారు. ఓట్ల కోసమే బీహార్ కు ప్రధాని ప్యాకేజీ ప్రకటించారని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక ఆంధ్రప్రదేశ్ లాగే బీహార్ కూ మొండి చేయి చూపిస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరా మాట్లాడారు. ఎల్లుండి ఢిల్లీ వెళుతున్న సీఎం చంద్రబాబుకు తాము మద్దతుగా ఉంటామన్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాతో పాటు మిగిలినవి కూడా సాధించుకు రావాలని రఘువీరా సూచించారు. ప్రతి హామీకి కాల పరిమితి నిర్దేశించుకోవాలన్న ఆయన, టీడీపీ నేతలు తలోమాట మాట్లాడకుండా చూసుకోవాలని చెప్పారు. ఏడాదిలో పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోతే కళాశాల యాజమాన్యాల చేత రూ.25 లక్షలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఓటుకు నోటు కేసుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సీబీఐ విచారణ కోరాలన్నారు. ఈ నెల 24న ఏపీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News