: రిక్షావాలా నిజాయతీకి ప్రతిఫలం...ఈ-రిక్షా బహూకరించిన వ్యాపారి
రిక్షావాలా నిజాయతీకి మంచి ప్రతిఫలం దక్కింది. కొద్ది రోజుల క్రితం రాజస్ధాన్ లోని జయపురకు చెందిన అబిద్ ఖురేషీ అనే రిక్షావాలాకు 1.17 లక్షల రూపాయలు దొరికాయి. పేదరికంలో ఉన్న అబిద్ ఖురేషీ దానిని తీసుకోకుండా, స్థానిక పోలీసులకు అప్పగించాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు వ్యాపారి లాల్ చంద్ నాగ్ పాల్ అనే వ్యాపార వేత్త జయపురకు వచ్చారు. పోలీసు అధికారి సాయంతో రిక్షావాలా అబిద్ ఖురేషీ ఇంటికి వెళ్లి, అతనిని అభినందించి, ఈ-రిక్షా (ఎలక్రానిక్ రిక్షా) బహూకరించారు. ఈ రోజుల్లో వంద రూపాయలు పోతేనే తిరిగి దొరకడం కష్టం, అలాంటిది లక్ష రూపాయల పైగా నగదు దొరికేతే, పేదరికంలో ఉన్నప్పటికీ దానిని నిజాయతీగా పోలీసులకు అప్పగించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.