: ఇండియాలో అంత వృద్ధి సాధ్యం కాదన్న మూడీస్


ఇప్పుడు ఇండియాలో నెలకొన్న పరిస్థితుల్లో ముందుగా అంచనా వేసిన విధంగా 7.5 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదని ప్రముఖ రేటింగ్ ఏజన్సీ మూడీస్ స్పష్టం చేసింది. భారత జీడీపీ వృద్ధి రేటు 2015 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. "రుతుపవనాలు సంతృప్తికరంగా లేవు. సాధారణంకన్నా వర్షపాతం తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధి రేటు ప్రభావితం కానుంది. మేము భారత జీడీపీ అంచనా వృద్ధిని 7 శాతానికి సవరిస్తున్నాం" అని 'గ్లోబల్ మాక్రో ఔట్ లుక్ ఫర్ 2015-16'లో మూడీస్ వ్యాఖ్యానించింది. అయితే, ఈ అంచనాల తగ్గింపు తాత్కాలికమేనని 2016-17లో 7.5 శాతం వృద్ధి సాధ్యమేనని వివరించింది. సంస్కరణల అమలు అనుకున్నంత వేగంగా జరగకపోవడం కూడా వృద్ధిని తగ్గిస్తోందని తెలిపింది. కీలక సంస్కరణల అమలు మొదలై విదేశీ పెట్టుబడులు విరివిగా తరలి వస్తే స్థూల జాతీయోత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇండియాలో ఒకటి, రెండు మినహా ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నాయని, ద్రవ్యోల్బణం సైతం సాధారణ స్థాయిలో కొనసాగటం భవిష్యత్తుపై ఆశలను పెంచుతోందని తెలిపింది.

  • Loading...

More Telugu News