: చంద్రుడిపై మండుతున్న వాయువులు, గుర్తించిన నాసా
చంద్రుడి గురించిన సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాసా ప్రయోగించిన 'లూనార్ అట్మాస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్ మెంట్ ఎక్స్ ప్లోరర్' (లాడీ) స్పేస్ క్రాఫ్ట్, చంద్రుడిపై నియాన్ గ్యాస్ మండుతున్నట్టు కనుగొంది. అత్యంత కాంతిమంతంగా మండే నియాన్ గ్యాస్ ను భూమిపై ఎలక్ట్రిక్ రంగంలో వాడతారు. కాగా, చంద్రుడిపై మంటలు చెలరేగుతుంటాయని దశాబ్దాల క్రితం నుంచే శాస్త్రవేత్తలు వాదిస్తూ వచ్చారు. అపోలో మిషన్ సమయంలోనే నియాన్ మంటలను గుర్తించినట్టు నాసా నిర్వహణలోని మేరీలాండ్, గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ శాస్త్రవేత్త మెహిదీ బెన్నా తెలిపారు. ఇప్పుడు అదే విషయం అధికారికంగా స్పష్టమైందని వివరించారు.