: నెల్లూరు చేరుకున్న ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం... సోమిరెడ్డి నివాసంలో అల్పాహారం


ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈ రోజు నెల్లూరు చేరుకుంది. రెండ్రోజుల పాటు ఈ బృందం నెల్లూరు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిపై అధ్యయనం చేయనుంది. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి ఛైర్మన్ చక్రపాణి నేతృత్వంలో 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించనుంది. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో ఈ బృందం సభ్యులు అల్పాహారం తీసుకున్నారు. ఇవాళ కృష్ణపట్నం ఓడరేవు, ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించనుంది.

  • Loading...

More Telugu News