: సుప్రీంకోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్... భద్రత కట్టుదిట్టం
దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కోర్టు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయితే ఈ-మెయిల్ ఎవరి నుంచి, ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియరాలేదు. ప్రస్తుతం మెయిల్ కు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేశాక జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు రావడంతో ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. తాజాగా సుప్రీంకోర్టునే పేల్చేస్తామని దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయి.