: కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్లకు అరెస్ట్ వారెంట్!


కేటీఆర్ గన్ మెన్, డ్రైవర్లపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ భావిస్తోంది. మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన కేసులో, విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసినా వారు స్పందించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని విచారణకు పంపించాలని తెలంగాణ ఐఎస్ డబ్ల్యూ విభాగం ఐజీకి కూడా ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాకపోవడంతో, ఇక అరెస్ట్ వారెంట్ ల జారీ తప్పదని భావిస్తున్న సీఐడీ అందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News