: నిజామాబాదు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం... రూ.3.80 లక్షల నగదు, 60 తులాల బంగారం చోరీ


నిజామాబాదు జిల్లాలో నిన్న రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారి కాచి ఓ కారును అడ్డగించిన దొంగలు కారులోని వ్యక్తులపై మారణాయుధాలతో దాడికి దిగడమే కాక వారి వద్ద నుంచి భారీ ఎత్తున నగదు, బంగారం అపహరించుకుని వెళ్లారు. వివరాల్లోకెళితే.. హైదరాబాదు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగర్వాల్ కంపెనీకి చెందిన ఉద్యోగులు నగరం నుంచి నాందేడ్ బయలుదేరారు. నిజామాబాదు జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గండి వద్ద దోపిడీ దొంగలు వీరి కారుపై దాడి చేశారు. ఆ సమయంలో వారి వద్దనున్న రూ.3.80 లక్షల నగదుతో పాటు 60 తులాల బంగారాన్ని కూడా దోచుకున్నారు. దొంగల దాడిలో తీవ్ర గాయాలపాలైన అగర్వాల్ కంపెనీ ఉద్యోగులు ఎలాగోలా బిచ్కుందకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News