: ఉగ్రవాద నిర్మూలనపై భారత్, యూఏఈ సంయుక్త ప్రకటన
ఉగ్రవాదాన్ని ఏ దేశం సమర్థించినా అందుకు అంగీకరించే ప్రసక్తేలేదని భారత్, యూఏఈ పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఉగ్రవాద నిర్మూలనకు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదానికి మతాన్ని ఉపయోగించుకోవడాన్ని ఖండించాయి. ఉగ్రవాద నిర్మూలనలో ద్వైపాక్షిక సహకారం మరింతగా పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఆరు నెలలకోసారి ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. నిధుల రాకపోకలు, నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలు సమ్మతి తెలిపాయి.