: ఉగ్రవాది నషీద్ కు సహకరించిన కానిస్టేబుల్ అరెస్టు
హైదరాబాదులోని చంచల్ గూడలో పట్టుబడిన పాకిస్థాన్ కు చెందిన హుజీ ఉగ్రవాద సంస్థకు చెందిన బంగ్లాదేశ్ వ్యక్తి నషీద్ కు సహకరించిన కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక దోషి సహా, మరో 15 మందిని దేశం దాటించిన నషీద్ కు పాస్ పోర్టులు తయారు చేయడంలో సహకరించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసు కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. నషీద్ భార్య హబియా కథోల్ ను సీసీఎస్ పోలీసులు విచారించిన అనంతరం బషీర్ అహ్మద్ ను అరెస్టు చేశారు. మరో కానిస్టేబుల్ పై డిపార్ట్ మెంటల్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన సంగతి తెలిసిందే.