: రెండో బాంబును నిర్వీర్యం చేసిన బ్యాంకాక్ పోలీసులు...భారతీయులు సేఫ్ అని ప్రకటించిన రాయబార కార్యాలయం
థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎరవాన్ ఆలయం దగ్గర జరిగిన పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు రెండో బాంబును నిర్వీర్యం చేశారు. ఈ వార్తలతో బ్యాంకాక్ వాసులు ఆందోళనలో పడ్డారు. తీవ్రవాదులు ఇంకా ఎక్కడైనా బాంబులు పెట్టారా? అని భయపడుతున్నారు. అయితే, ఎవరూ ఆందోళనకు గురి కావద్దని సూచిస్తున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఎరవాన్ ఆలయం దగ్గర జరిగిన బాంబు పేలుడులో భారతీయులెవరూ గాయపడలేదని థాయ్ లాండ్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. బాంబు పేలుడుపై భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, భారతీయులు గాయపడినట్టు సమాచారం లేదని రాయబారి స్పష్టం చేశారు.