: బ్యాంకాక్ లో పేలింది మోటార్ సైకిల్ బాంబులా?


థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ప్రఖ్యాత ఎరవాన్ ఆలయం వద్ద జరిగిన పేలుడు ఘటనలో మోటార్ సైకిల్ బాంబులు వినియోగించినట్టు అర్థమవుతోంది. ఘటనాస్థలి వద్ద రెండు బైకులు పూర్తిగా దగ్ధమైన స్థితిలో కనిపించాయి. దాంతో, మోటార్ సైకిళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి, రిమోట్ సాయంతో పేల్చి ఉంటారని భావిస్తున్నారు. ఘటనకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. మృతుల సంఖ్య 15కి పెరిగింది. ఎరవాన్ మందిరంలో పూజలందుకునేది సృష్టికర్త బ్రహ్మ. హిందూ దేవాలయం అయినా, బౌద్ధ మతస్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

  • Loading...

More Telugu News